TSAFE యాప్: చిన్నారులు, మహిళల భద్రతకు సులభమైన పరిష్కారం 🚨
కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన దాడి ఘటనతో దేశమంతా మహిళా భద్రతపై చర్చలు మొదలయ్యాయి. TSAFE యాప్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి, మీ కుటుంబం, స్నేహితుల భద్రత కోసం ఈ సులభ టిప్స్‌ను అనుసరించండి.
ETVBHARAT
2 views • Aug 23, 2024
About this video
How to Use TSAFE App : కోల్కతాలో పని ప్రదేశంలో వైద్యురాలిపై హత్యాచార ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. ప్రతి రాష్ట్రంలో నిరసన సెగలు రాజుకున్నాయి. మహిళాభద్రతకై ప్రభుత్వాల ప్రత్యేక చర్యలు, ర్యాలీలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా జరిగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో టీ సేఫ్(TSAFE) పేరు వార్తల్లోకి వచ్చింది. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం బయటికొచ్చిన మహిళలకు సురక్షితంగా గమ్యస్థానాలు చేరేవరకు పోలీసు నిఘా ఉంటే ఈ యాప్ గురించి సర్వత్రా చర్చనడుస్తోంది.<br /><br />టీ సేఫ్ యాప్‌ను ప్రతి ఒక్క మహిళ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఉమెన్ సేఫ్టీ వింగ్, పోలీసు శాఖ సంయుక్తంగా టీ సేఫ్ యాప్‌ను 2024 మార్చిలో రూపొందించారు. దీని ద్వారా మహిళలు, విద్యార్థినులకు ప్రయాణ సమయంలో ఆకతాయిలు నుంచి ఏమైనా ఇబ్బంది తలెత్తితే తక్షణం పోలీసు రక్షణ లభిస్తుంది. ఇది దేశంలోనే మొదటి ట్రావెల్ మానిటరింగ్ సేవ అని చెప్పవచ్చు. ఈ యాప్ ప్రయాణ సమయంలో ప్రతి స్టెప్‌ను కనిపెడుతూ మానిటర్ చేస్తూ ఉంటుంది.
Video Information
Views
2
Duration
5:20
Published
Aug 23, 2024
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.