Talented Actor Joins Jr NTR in Aravinda Sametha Shooting
Trivikram Srinivas has teamed up with Jr NTR for Aravinda Sametha. The first look was launched on the actor's birthday and received an enthusiastic response.
Filmibeat Telugu
1.1K views • Jun 27, 2018
About this video
Trivikram Srinivas has now teamed up with Jr NTR for Aravindha Sametha. On the actor's birthday, the first look of the film was launched and it received an overwhelming response. <br /> <br />ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించబోతున్నాడు. అరవింద సమేత చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వరుసగా విజయాలు సాధిస్తున్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో మరో భారీ హిట్ పై కన్నేశాడు. జగపతి బాబు, నాగబాబు వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా మరో ప్రముఖ నటుడు అరవింద సమేత షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అరవింద సమేత ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆ మధ్యన విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ అదరగొట్టేసాడు. ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. <br />ఆయితే ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. నాగబాబు ఎన్టీఆర్ తండ్రిగా నటిస్తారని సమాచారం. అరవింద సమేత చిత్రంలో మరో ప్రముఖ నటుడు నటిస్తున్నాడు. శుభలేఖ సుధాకర్ ఇటీవలకే చిత్ర షూట్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. శుభలేఖ సుధాకర్ నటిస్తున్న చిత్రాల సంఖ్య ప్రస్తుతం బాగా తగ్గింది. అతడి కెరీర్ తిరిగి పుంజుకోవడానికి అరవింద సమేత చిత్రం బాగా ఉపయోగపడుతుంది.ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోలతో నటిస్తున్న పూజా హెగ్డే ఈ చిత్రంలో కూడా హీరోయిన్. పూజా హెగ్డే తో పాటు ఇషా రెబ్బా ఈ చిత్రంలో మరో కీ రోల్ ప్లే చేయనుంది. చూడాలి మరీ ఈ చిత్రం ఎంత వరకు అభిమానులను మెప్పిస్తుందో.
Video Information
Views
1.1K
Duration
1:19
Published
Jun 27, 2018
User Reviews
3.7
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
Trending Now