Kamma Global Federation Summit 2024: రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ గురించి ప్రత్యేక వ్యాఖ్యలు 🗣️
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ అని అన్నారు, ఇది ఆయన నుంచే నేర్చుకున్న విషయమని వెల్లడించారు.
ETVBHARAT
329 views • Jul 20, 2024
About this video
Kamma Global Federation Summit 2024 : రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ అని అనర్గళంగా మాట్లాడటం ఆయన నుంచే నేర్చుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన కమ్మ ప్రపంచ మహాసభల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ సభలను నిర్వహించనున్నారు. సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హాజరయ్యారు. <br /><br />ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కమ్మ అంటే అమ్మ లాంటిది అని మట్టి నుంచి బంగారం తీయగల శక్తి కమ్మవారికి ఉందని పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను అభిమానిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ లైబ్రరీలో చదువుకున్న చదువే ఉన్నతస్థాయికి తెచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాల వల్లే నేడు చాలా మంది రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశాన్ని ఏలుతున్నాయని చెప్పారు. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీ రెండు సీట్లలో ఒక ఎంపీ సీటు గెలిచిందన్నారు. అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరూ కాదనలేరని హర్షించారు.
Video Information
Views
329
Duration
3:13
Published
Jul 20, 2024
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.