Sri Reddy Appeals to Pawan Kalyan for Response Amid Emotional Appeal

Sri Reddy requests Pawan Kalyan to respond, expressing her emotions after meeting OU students. Her ongoing struggle takes a new turn as she continues her fight for women's rights.

Filmibeat Telugu852 views1:35

About this video

Sri Reddy request PawanKalyan to respond. She became emotional after meets OU students

నటి శ్రీరెడ్డి పోరాటం కొత్త మలుపులు తిరుగుతోంది. శ్రీరెడ్డికి మహిళా సంఘాల నుంచి మద్దత్తు లభిస్తోంది. తాజాగా ఓయూ విద్యార్థులు కూడా శ్రీరెడ్డికి మద్దత్తు తెలపడం విశేషం. టాలీవుడ్ లో కొందరు అమ్మాయిలని రాబందుల్లా పీక్కుతింటున్నారని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీరెడ్డి కొద్దీ సేపటి క్రితం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అక్కడ విద్యార్థుల మద్దత్తు కూడగట్టింది. గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి టాలీవుడ్ లో, మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్థ నగ్న నిరసన జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ అయింది.
శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ముందు చేసిన అర్ధనగ్న నిరసనతో ఆమె పోరాటం మరింతగా హీటెక్కింది. ప్రస్తుతం తెలుగు మీడియా ఫోకస్ మొత్తం శ్రీరెడ్డి వైపే ఉందని అనడంలో సందేహం లేదు.
ఆడపిల్ల కన్నీరు కారిస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని ఓయూ విద్యార్థులు నిరూపించారని శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడింది. ఒక చెల్లిగా తనని ఆదరించడానికి వారు ముందుకు వచ్చారని శ్రీరెడ్డి తెలిపింది.
తనలాగా మోసగింపబడిన యువతులు చాలా మంది యువతులు ఇండస్ట్రీలో ఉన్నారని శ్రీరెడ్డి తెలిపింది. తెలుగు అమ్మాయిలకు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. దీనిపైనే తన పోరాటం అని తెలిపింది.
తాను బట్టలు విప్పేసాను అంటున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది.. ఎవరికోసం తాను బట్టలు విప్పాను అని శ్రీరెడ్డి మీడియా ముఖంగా ప్రశ్నించింది. మా అసోసియేషన్ వారు ప్రెస్ మీట్ పెట్టారు కానీ తనకు మద్దతుగా ఒక్కరు కూడా రాలేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా శ్రీరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా మీడియా ముఖంగా కోరింది. పవన్ అన్నా మీరు స్పందించాలి అని అప్పీల్ చేసింది. ఇంటగెలిచి రచ్చ గెలవాలి అని పవన్ ని కోరింది. ప్రజా సమస్యల గురించి మీరు వేదికలపై మాట్లాడతారు. ప్రపంచమంతా చర్చించుకుంటున్నా ఈ విషయం గురించి మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నా.. ఇది ఆడపిల్ల వ్యవహారం అన్నా.. ఒకేసారి మాట్లాడండి అన్నా అంటూ శ్రీరెడ్డి పవన్ ని కోరింది.

Video Information

Views
852

Total views since publication

Duration
1:35

Video length

Published
Apr 12, 2018

Release date

Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Vietnam under the topic 'cúm a'.

Share This Video

SOCIAL SHARE

Share this video with your friends and followers across all major social platforms. Help spread the word about great content!